కాకినాడ జిల్లా పోలీస్ శాఖకు రూ. 10 లక్షల విలువ గల 96 సీసీ కెమెరాలను కోరమండల్ ఇంటర్నేషనల్ సంస్థ సభ్యులు మంగళవారం ఎస్పీ జి. బిందుమాధవ్కి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ, కోరమండల్ సంస్థ సభ్యులను అభినందించారు. ఈ సాంకేతిక పరికరాలను, ప్రజల భద్రతా కొరకు, నేరాల నియంత్రణకు, ట్రాఫిక్ పర్యవేక్షణకు వినియోగించనున్నట్లు తెలిపారు.