SKLM: ఆమదాలవలస ఎమ్మార్వో కార్యాలయంలో మంగళవారం మండల వ్యవసాయ అధికారి మెట్ట మోహన రావు ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ధాన్యం కొనుగోలు విధానాలు, ఆన్లైన్ ఎంట్రీ ప్రక్రియ అంశాలపై అవగాహన కల్పించారు. రైతులకు నష్టం కాకుండా సమయానికి ధాన్యం కొనుగోలు జరగాలని తెలిపారు.