BHPL: జిల్లా వ్యాప్తంగా 1,31,236 క్వింటాళ్ల వరి ధాన్యానికి సంబంధించిన సుమారు రూ.6.56 కోట్ల బోనస్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రకటించినప్పటికీ, కొనుగోళ్లు ముగిసి రెండు నెలలు దాటినా రైతుల ఖాతాల్లో ఇంకా నగదు జమ కాలేదు. బోనస్ మొత్తం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ వెండి ధరలు భారీగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.15,000 తగ్గి రూ.2,45,000 ఉంది. అయితే, బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.160 పెరిగి రూ.1,44,710కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 పెరిగి రూ.1,32,650 పలుకుతోంది.
తిరుపతి జిల్లాలో పోలీస్ డాగ్ చనిపోయింది. 2016లో హైదరాబాద్ మోయినాబాద్‌లోని IITAలో ‘హంటర్’ డాగ్ ట్రైనింగ్ తీసుకుంది. తర్వాత తిరుపతికి తీసుకు వచ్చారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో విశేషంగా కృషి చేసింది. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఈక్రమంలో నిన్న చనిపోయింది. ఎస్పీ డి. శ్రీనివాసరావు, సిబ్బంది హంటరు నివాళులర్పించారు.
PPM: ఆర్టీసీ బస్ స్టేషన్‌లో ప్రయాణికులకు ఆహ్లాదాన్ని ఇచ్చేలా, అన్ని రకాల మౌలిక వసతులతో ఉండాలని కలెక్టర్ డా, ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలో ఉన్న బస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా బస్ స్టేషన్‌లోని ఫ్లాట్ పారంలు, తాగునీటి వసతి, విక్రయ దుకాణాలు, మరుగుదొడ్లు పారిశుధ్య పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
HYD: జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కార్పొరేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. గత 4 నెలల్లో మొత్తం 45 అక్రమ భవనాలను గుర్తించి సీజ్ చేసినట్లు వెల్లడించారు. అనుమతులు లేకుండా లేదా నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.
RR: జిల్లా పరిధిలో HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. గర్భాశయముఖ ద్వార క్యాన్సర్ నివారణకు కీలకమైన ఈ టీకాను ముఖ్యంగా 14 ఏళ్ల బాలికలకు అందిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 150 మందికి పైగా బాలికలకు వ్యాక్సిన్ ఇచ్చినట్లు వెల్లడించారు.
ASR: సూరంపాలెం ప్రాజెక్టులో బుధవారం సాయంత్రం నీటమునిగిన యువకుడి మృతదేహం శుక్రవారం ఉదయం లభ్యమైంది. ఎస్సై వెంకయ్య ఆధ్వర్యంలో రెండు రోజులుగా విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు నెల్లిపూడి గ్రామానికి చెందిన కొంజర్ల ఈశ్వర వరప్రసాద్ (21)గా గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పేర్కొన్నారు.
TG: భద్రాద్రి రామునికి రామదాసు చేయించిన ఆభరణాలనే నేటికీ ధరింపజేస్తారు. కళ్యాణం రోజున రాముల వారు ధరించే రవ్వల వైరముడి, మధ్యలో గల నీలపురాయి మద్రాసుకు చెందిన వేశ్య.. శ్రీరామునికి సమర్పించిందని కథనం. సీతారాముల అలంకరణకు సయ్యద్ మీరా అనే ముస్లిం భక్తుడు బంగారు తోడాలు ఇచ్చారు. భక్తరామదాసు 30 తులాలతో చేయించిన మూడు బంగారు మంగళ సూత్రాలతోనే సీతమ్మ వారికి సూత్రధారణ జరుగుతుంది.
MDCL: బోడుప్పల్‌లో రూ.19.60 కోట్లతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. బంగారు మైసమ్మ ఆలయం నుంచి చెంగిచెర్ల వరకు, అంబేద్కర్ విగ్రహం నుంచి చిలుకానగర్ వరకు పనులు ఆలస్యమవుతున్నాయి. విద్యుత్ స్తంభాల మార్పులో నిర్లక్ష్యం కారణంగా పనులు ముందుకు సాగడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
KNR: ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల ఎన్ఎస్ఎస్ (1, 3 యూనిట్లు) ఆధ్వర్యంలో కొక్కెరకుంట, వన్నారం గ్రామాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక సేవా శిబిరాలు గురువారం మూడో రోజుకు చేరుకున్నాయి. ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ బీ. సంజీవ్ వాలంటీర్లతో కలిసి గ్రామాల్లో మొక్కలు నాటి, విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
CTR: పుంగనూరు పట్టణం తాటిమాకుల పాళ్యంలో గల విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో శనివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మునస్వామి మొదలియార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శిబిరం జరుగుతుందని చెప్పారు. శంకర్ నేత్రాలయ ఆసుపత్రి నుంచి వైద్యులు వచ్చి పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.
AP: రాష్ట్రంలో 7 మల్టీ విలేజ్ తాగునీటి పథకాలకు ప్రభుత్వం రూ.9,335 కోట్లు మంజూరు చేసింది. కాకినాడ, అనకాపల్లి(D)లకు ఏలేరు రిజర్వాయర్ నుంచి, చిత్తూరు(D)కు గండికోట, శ్రీకాకుళం(D) టెక్కలి, నరసన్నపేటకు హిరమండలం నుంచి నీటిని అందించనుంది. అనంతపురం(D) ఉరవకొండ, రాయదుర్గంకు PABR, కర్నూలు(D) బనగానపల్లికి ఓక్ రిజర్వాయర్, తూ.గో(D) కడియంకు ధవళేశ్వరం నుంచి నీటిని అందించే పనులు చేయనుంది.
VKB: తాండూరు కాంగ్రెస్ పట్టణ అధ్యక్ష నియమకంపై ఆ పార్టీలో గందరగోళం నెలకొంది. పార్టీ సీనియర్ నేత లింగదల్లి రవికుమార్ అధ్యక్ష పదవి కోరుకుంటున్నట్లు సమాచారం. మరి అదే పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ జుబెర్ లాలా అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది.
MNCL: అడవిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని, అందరూ సహకరించాలని జన్నారం అటవీశాఖ ఎఫ్డీవో రామ్మోహన్ కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. వేసవి నేపథ్యంలో అడవిలో అక్కడక్కడ అగ్ని ప్రమాదాల సంఘటనల సమాచారం అందగానే సిబ్బందిని పంపి మంటలను ఆర్పి వేస్తున్నామన్నారు. అటవీ సమీప గ్రామాల ప్రజలు కూడా పంట, తదితర వ్యర్ధాలను అడవి సమీపంలో కాల్చవద్దన్నారు.
సత్యసాయి: హిందూపురం అహమ్మద్ కాలనీలో ఇవాళ ఉదయం పోలీసులు ‘ఆపరేషన్ వజ్రప్రహార్’ నిర్వహించారు. ఎస్పీ సతీష్ కుమార్ పర్యవేక్షణలో డీఎస్పీ మహేష్ నేతృత్వంలో డ్రగ్స్ రహిత జిల్లా లక్ష్యంగా ఈ మెగా కార్డన్ అండ్ సెర్చ్ చేపట్టారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 37 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను సీజ్ చేసి, రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు.