KMM: దుర్వాసనతో పరిసర ప్రాంత ప్రజలను ఇబ్బంది పెట్టిన ఖమ్మం నగరంలోని దానవాయిగూడెం డంపింగ్ యార్డు ఇప్పుడు హరిత సోయగంతో అందంగా మారింది. పేరుకుపోయిన లక్షల మె.ట వ్యర్థాలను శుభ్రం చేసే లక్ష్యంతో బయోమైనింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శుభ్రం చేసిన స్థలంలోనే 8 ఎకరాల్లో 8 వేలకు పైగా పండ్లు, పూలు, నీడనిచ్చే పలు రకాల మొక్కలు నాటారు.
KDP: పెన్నా నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆ దారి మీదుగా కమలాపురం నుంచి గంగవరం మీదుగా చాపాడుకు రాకపోకలు సాగిస్తారు. ఈ మార్గంలో లో లెవెల్ వంతెన వల్ల సమస్య ఎదురవుతోందని ఆ ప్రాంత వాసులు అంటున్నారు.
PPM: పార్వతీపురం మండలంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 21, 22 తేదీల్లో శ్రావణమాస మాసశివరాత్రి సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం, ప్రత్యేక అభిషేక పూజలను నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు శ్రీనివాస్ పాడి తెలిపారు. ఈ మేరకు స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించదలచిన భక్తులు తమ పేర్లు ముందుగా నమోదు చేయించుకోవాలని పేర్కొన్నారు.
VSP: ఆల్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లాలో మెంటాడకు చెందిన బొడ్డు తిరుపతి (25), గొట్టాపు నాగేంద్రబాబు (25), రాపర్తి నాగేశ్వరరావు(25)ను అరెస్టు చేసి వారి నుంచి మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు.
NRPT: లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణపేట ఆధ్వర్యంలో ఇవాళ పాత బస్టాండ్ చిన్న పిల్లల ఆసుపత్రిలో షుగర్, చిన్నారులకు ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ ఫాస్ట్ గవర్నర్ హరినారాయణ్ బట్టడ్, అధ్యక్షురాలు సరిత తెలిపారు. శిబిరంలో పరీక్షల అనంతరం ఉచితంగా మందులు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
GNTR: గుంటూరు స్వర్ణభారతీనగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ సురేశ్‌ను గురువారం విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యసనాలకు బానిసై, డబ్బు కోసం చోరీలకు పాల్పడుతున్నట్లు ఏసీపీ దామోదర్ తెలిపారు. విజయవాడలో 130 గ్రాముల బంగారం, 2.5 కిలోల వెండి దొంగిలించినట్లు చెప్పారు. సురేశ్‌పై ఇప్పటికే 30 చోరీ కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.
CTR: చౌడేపల్లి మండలం గడ్డం వారి పల్లి సర్పంచ్ భాగ్యవతి హరినాథ్ ఢిల్లీలో ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అరుదైన అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని జంగాలపల్లి రమణ భవనంలో వైసీపీ మండల అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. పంచాయతీ స్థాయి నుంచి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణమని పలువురు పేర్కొన్నారు.
JN: జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వాతావరణం అనుకూలంగా ఉన్నందున ఈనెల 22 నుంచి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. వ్యవసాయ సంబంధిత పనులకు ప్రాధాన్యత ఇస్తూ ఇతర పనులను కూడా చేపట్టాలన్నారు.
GDWL: వర్షాకాలంలో వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అలంపూర్ మున్సిపల్ కమిషనర్ కె.శ్రీరాములు సూచించారు. ప్రజలు తమ చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడా చెత్తాచెదారం వేయకుండా చూసుకోవాలని తెలిపారు. అలాగే, వర్షపు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, దీనివల్ల దోమలు వృద్ధి చెంది వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు.
JN: రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామం ఒకప్పుడు కళ్యాణి చాళుక్యులు, కాకతీయుల సామంతరాజులైన నతవాడి రాజుల పాలనలో విరాజిల్లింది. ఇక్కడ పాత శాసనాలు, శిల్పాలు, మందిరాలు వంటి చారిత్రక చిహ్నాలు ఉన్నాయి. ప్రకృతి అందాలతో పర్యాటక ప్రాంతంగా ఎదగాల్సిన ఈ గ్రామం, ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా తన పూర్వ వైభవాన్ని కోల్పోయి ప్రస్తుతం అంధకారంలో ఉంది.
MHBD: జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 9 ఎరువుల దుకాణాల లైసెన్సులు తాత్కాలికంగా రద్దు చేసినట్లు డీఏవో విజయనిర్మల తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ బృందాలు మండలాల్లోని ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. రద్దు అయిన దుకాణాల వివరాలు.. డోర్నకల్ (3), కురవి (2), మరిపెడ (1), చిన్నగూడూరు 1, నెల్లికుదురు 1 MHBD (1) వివరించారు.
NLR: కోవూరు MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి వార్నింగ్ లెటర్ రావడం కలకలం రేపుతోంది. ఈనెల 17న ఓ వ్యక్తి ఎమ్మెల్యే ఇంటి వాచ్‌మెన్‌కు లెటర్ ఇచ్చి వెళ్లిపోయాడు. ‘రూ. 2కోట్లు ఇవ్వకపోతే చంపేస్తా’ అని అందులో రాసి ఉంది. దీంతో అతను భయపడి పోలీసులకు ఫిర్యాదు చేయగా, రహస్యంగా విచారిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
NLG: గట్టుపల్ మండలంలోని నామాపురం నుంచి అంతంపేట వరకు ఉన్న రహదారి పరిస్థితి అత్యంత దయానీయంగా మారింది. రోడ్డు గుంతల మయంగా మారడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వర్షం కురిసినా రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డును మరమ్మత్తు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రకాశం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో ఖాళీల ఆధారంగా 9 మంది హెడ్ కానిస్టేబుళ్లకు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ హోదాకు పదోన్నతి కల్పిస్తూ ఎస్పీ దామోదర్ బుధవారం ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా పదోన్నతులు పొందిన వారిని తన కార్యాలయంలో ఎస్పీ అభినందించారు. ఈ నేపథ్యంలో ఎస్పీ మాట్లాడుతూ..పోలీస్ శాఖలో మరింత నిబద్ధత కలిగి విధులు నిర్వర్తించాలన్నారు.
HYD: అంతర్జాతీయ పేరు గడించిన HYDలో వ్యభిచారం వ్యాపారంగా మారింది. వివిధ దేశాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి కొందరు వ్యభిచార ఊబిలోకి లాగుతున్నారు. ఇటీవల బండ్లగూడ, KPHB, మియాపూర్ ప్రాంతాల్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. అందం, వయసు ఆధారంగా ధర నిర్ణయించి వల వేస్తున్నారు. పదేపదే ఈ ఘటనలు జరుగుతున్నా.. పూర్తిస్థాయిలో అదుపు కావడం లేదు.