ELR: ఆగిరిపల్లి మండలం చిన్నాగిరిపల్లిలో వివాహిత ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఎస్సై కే.శుభశేకర్ తెలిపిన వివరాల ప్రకారం.. సోనియాకు భర్త రాముతో కొంతకాలంగా మనస్పర్ధలు ఏర్పడగా పుట్టింటికి వెళ్లి వచ్చింది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నట్లు తెలిపారు. స్థానికులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.
NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. గురువారం ఉదయం ఆరు గంటల నాటికి జలాశయంలో 53.889 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమశిల జలాశయం నుంచి పెన్నా డెల్టాకు 1000 క్యూసెక్కులు, కావలి కెనాల్ కు 850 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.
KMR: జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు 4392.55 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు DAO మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 2,522 మంది రైతులకు ఈ నష్టం వాటిల్లిందని చెప్పారు. సోయా-2,540 ఎకరాలు, వరి-1,619.15, పత్తి-85, పెసలు-100, మొక్కజొన్న- 97, టమాట, కాకర, బీర- 1.4 ఎకరాల్లో ప్రాథమిక అంచనా ప్రకారం ఈ నష్టం జరిగిందని పేర్కొన్నారు.
మహబూబ్ నగర్ నియోజకవర్గంలో యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది. యూరియా కోసం జిల్లా మార్కెటింగ్ సహకార సంఘం లిమిటెడ్ కార్యాలయం ఎదుట రైతులు గురువారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున తమ చెప్పులను ఉంచి పడిగాపులు కాస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. యూరియాను సకాలంలో అందజేస్తే తమ పనులు తాము చేసుకుంటామని ఇటువంటి ఇబ్బందులు ఎప్పుడూ చూడలేదని వాపోయారు.
KRNL: జిల్లాలోని మంత్రాలయం రాఘవేంద్ర స్వామి శ్రీ మఠంలో గత 22 రోజులలో భక్తులు సమర్పించిన కానుకలను అధికారులు లెక్కించారు. మఠం అధికారుల వివరాల ప్రకారం.. మొత్తం రూ. 3,35,31,756 నగదు రూపంలో ఆదాయం నమోదయ్యింది. దీంతో పాటు 1.440 కిలోల వెండి, 7.4 తులాల బంగారం, వివిధ దేశాల కరెన్సీ కూడా కానుకలుగా వచ్చినట్లు తెలిపారు.
HYD: సింగల్‌గా ఉన్నారా..? జర జాగ్రత్త..! పెళ్లికాని ప్రసాదులు ఆకర్షణ బుట్టలో ఇట్టే పడిపోతున్నారు. డేటింగ్ యాప్స్, వాట్సాప్, ఇన్స్టా, టెలిగ్రామ్‌లో పరిచయం అవుతున్న యువతులు రాత్రి న్యూడ్ కాల్ చేస్తామని చెప్పి రూ.500 నుంచి రూ.2,000 వసూలు చేస్తున్నారు. సింగిల్స్ వీక్‌నెస్‌ను క్యాష్ చేసుకుని 10 నిమిషాల కాల్స్‌తో రూ.వేలల్లో లాగేస్తున్నారు.
TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. 25 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న(బుధవారం) శ్రీవారిని 75,688 మంది భక్తులు దర్శించుకోగా.. 29,099 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.45 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
SRD: మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద ఎక్సైజ్ అధికారులు 440 గ్రాములు ఎండు గంజాయిని గురువారం ఎక్సైజ్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్‌కు చెందిన తాజ్ మహమ్మద్ బీదర్‌లో గంజాయి కొనుగోలు చేశాడు. హైదరాబాదులో విక్రయించేందుకు కర్ణాటక ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా తనిఖీల్లో భాగంగా కట్టుబడినట్లు చెప్పారు.
ASR: కొయ్యూరు మండలం వెలగలపాలెంకు చెందిన సుర్ల సింహాచలం అనే వ్యక్తికి చెందిన పూరిల్లు కూలిపోయింది. గత వారం రోజులుగా మండలంలో ఎడతెరపి కురిసిన వర్షాలకు తడిసిపోయి, చెమ్మ చేరడం వల్ల పూరిల్లు నేల కూలిందని గ్రామస్తులు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన సింహాచలం కుటుంబం నిలువ నీడ కోల్పోయారన్నారు. బాధితుడికి ప్రభుత్వం నుంచి పక్కా గృహం మంజూరు చేయాలని కోరారు.
ATP: గుంతకల్లు 35వ వార్డు టీడీపీ కౌన్సిలర్ మహ్మద్ షరీప్ అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్ని నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. షరీఫ్ బుధవారం రాత్రి స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్, స్కానింగ్ పూర్తి చేసుకుని బయటకు వచ్చే క్రమంలో మరణించినట్లు అతని బందువులు తెలియజేశారు. షరీఫ్‌కు భార్య, కుమారుడు ఉన్నారు.
ELR: రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు ప్రకటన విడుదలైనట్లు జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నోడల్ అధికారి గిరిబాబు నిన్న తెలిపారు. ఇంటర్ లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు ఈనెల 26 లోపు https:///oamdc.ucanapply.com అప్లై చేసుకోవాలన్నారు. అలాగే, సహాయ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు.
WNP: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెద్దామందడి మండలం జంగమయ్యపల్లిలోని పోలికల బాలస్వామి ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనపై అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ గురువారం ఉదయం గ్రామాన్ని సందర్శించి, స్వయంగా పరిశీలించారు. ఈ మేరకు ఆయన బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి, ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయం అందిస్తామన్నారు. శిధిలావస్థలో ఉన్న ఇండ్లను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు.
MBNR: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు అమరరాజ కంపెనీ రోడ్డు, భూత్పూర్ మండలం అమిస్తాపూర్-రాందాస్ తండా, అప్పన్నపల్లి-ఇదిరా గ్రామాల మధ్య దెబ్బతిన్న రోడ్లను పరిశీలిస్తారు. అనంతరం ఆయన జిల్లా అధికారులతో సమావేశమై పలు అంశాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
W.G: ఎన్టీఆర్ పింఛన్ల పరిశీలనలో భాగంగా అనర్హులుగా నోటీసులు అందుకున్న వారు పునఃపరిశీలన కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని డీఆర్డీఏ పీడీ వేణుగోపాల్ తెలిపారు. జిల్లాలో దివ్యాంగుల కేటగిరీలో 1,904 మందిని అనర్హులుగా గుర్తించగా.. వీరిలో 1,289 మందిని వృద్ధాప్య పింఛన్లుగా ప్రభుత్వం మార్పు చేసిందన్నారు.
PLD: ఒంగోలులో ఆగస్టు 23 నుంచి 25 వరకు జరిగే సీపీఐ పార్టీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని వినుకొండ నియోజకవర్గ కార్యదర్శి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఆజాద్ నగర్ కాలనీలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. వినుకొండ నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరు కావాలని, తద్వారా మహాసభలను జయప్రదం చేయాలని ఆయన కోరారు.