• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఇంటర్‌లో చేరేందుకు మరో అవకాశం : ADB DIEO

ADB: ఇంటర్మీడియట్ కళాశాలలో ప్రవేశాల కోసం మరొకసారి గడువు పొడిగించినట్లు ఆదిలాబాద్ DIEO జాదవ్ గణేష్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువు ఈ నెల 31వ తేదీ వరకు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. గుర్తింపు పొందిన కళాశాలల జాబితా ఇంటర్ బోర్డు అధికారిక వెల్లడించారు.

August 21, 2025 / 05:41 AM IST

పుట్టపర్తి నియోజకవర్గంలో హంద్రీనీవా నీటి ప్రవాహం

సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గంలోని బుక్కపట్నం చెరువులోకి హంద్రీనీవా కాలువ ద్వారా బుధవారం నీటిని విడుదల చేయడంతో చెరువు పూర్తిగా నిండిపోయింది. చెరువులో నీరు చేరడంతో పరిసర గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేస్తూ, పంటల సాగు సాఫీగా సాగడానికి ఇది అనుకూలంగా మారిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

August 21, 2025 / 05:37 AM IST

రెండో ప్రమాద హెచ్చరిక జారీ

BDK: భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరగడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయిన నేపథ్యంలో ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచించారు. అధికారులు ఇప్పటికే పునరావాస చర్యలు చేపట్టారని, అవసరమైతే మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

August 21, 2025 / 05:36 AM IST

జిల్లాలో 2,484 ఎకరాల్లో నష్టం

MDK: జిల్లాలో 2,484 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇందులో 1,620 ఎకరాల్లో వరి, 657 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న ఇతర పంటలు 115 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ఉన్నతాధికారులకు నివేదించారు. ప్రధానంగా మంజీరా నది, కాలువలు పరివాహాక ప్రాంతంలో పంటలు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు.

August 21, 2025 / 05:35 AM IST

మీనం.. ఇక అంతా సిద్ధం.!

KMM: జిల్లాలో చేప పిల్లల పంపిణీకి అంతా సిద్ధమైంది. సెప్టెంబర్ ఒకటో తేదీన సరఫరాదారుల నుంచి వచ్చిన టెండర్లు పరిశీలించి, వారి అర్హతలను బట్టి ఖరారు చేయనున్నారు. ఖమ్మం జిల్లాలో రిజర్వాయర్లు, కుంటలు కలిపి 882 ఉండగా, వీటికి 3.49 కోట్ల ఉచిత చేప పిల్లలను సరఫరా చేయనున్నామని అధికారులు తెలిపారు.

August 21, 2025 / 05:27 AM IST

లై డిటెక్టర్ టెస్ట్‌కు బాలిక కుటుంబసభ్యులు?

KDP: జూలై 14న గండికోటలో బాలిక హత్య కేసు మిస్టరీగా మారింది. డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ అశోక్ కుమార్ పర్యవేక్షణలో కేసు విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే బాలిక తల్లిదండ్రులతో పాటు దాదాపు 400 మందిని విచారించారు. కాగా ఈ నెల 26న లై డిటెక్టర్ టెస్ట్ కోసం జమ్మలమడుగు కోర్టుకు రావాలని బుధవారం సాయంత్రం బాలిక కుటుంబసభ్యులకు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.

August 21, 2025 / 05:25 AM IST

నేడు ఆలమూరులో పవర్ కట్

కోనసీమ: ఆలమూరు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ట్రాన్స్ కో ఏఈ దుర్గాప్రసాద్ తెలిపారు. విద్యుత్ న్యూ లైన్స్ నిమిత్తం గురువారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలమూరు సబ్ స్టేషన్ పరిధిలో గల వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.

August 21, 2025 / 05:22 AM IST

ADB: వైన్స్ షాప్ చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్

ADB: ఆదిలాబాద్ పట్టణం తిర్పల్లిలోని శ్రీనివాస వైన్స్‌లో గోడకు రంధ్రం చేసి చోరీకి యత్నించిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. వడ్డెర కాలనీకి చెందిన బిలాల్, చిలుకూరి లక్ష్మీనగర్‌కు చెందిన షారుక్‌తో పాటు మరో ముగ్గురు చోరీకి యత్నించారన్నారు. బుధవారం పంజాబ్ చౌక్‌లో అనుమానస్పదంగా తిరుగుతున్న బిలాల్, షారుక్‌లను అరెస్టు చేశామని చెప్పారు.

August 21, 2025 / 05:20 AM IST

యూరియా కొరతపై.. ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

KNR: తెలంగాణలో యూరియా కొరతపై కాంగ్రెస్ పార్టీ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ నాయకులే యూరియాను బ్లాక్ చేసి రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. దీనిపై తమకు సమాచారం ఉందని అన్నారు. కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన కేటీఆర్ తమను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఆయన సైకో, శాడిస్ట్‌ల ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.

August 21, 2025 / 05:14 AM IST

‘అనర్హుల పేరిట దివ్యాంగుల ఫించన్లు తొలగించడం సరికాదు’

VZM: అనర్హుల పేరిట దివ్యాంగుల పింఛన్లు తొలగించడం ప్రభుత్వానికి సరి కాదని ఏపీ దళితకూలి రైతు సంఘం నాయకుడు డి. కిరణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం వేపాడలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మండలంలో 757 దివ్యాంగు పింఛన్లు ఉండగా అందులో అనర్హత పేరిట 259 పింఛన్లు తొలగిస్తామంటూ నోటీసులు ఇవ్వడం తగదు అన్నారు. ఈ కార్యక్రమంలో బంగారయ్య, ఎర్రి బాబు, విజయ్‌ పాల్గొన్నారు.

August 21, 2025 / 05:11 AM IST

‘అద్దెలు చెల్లించకపోతే దుకాణాలను మూసివేస్తాం

VZM: మున్సిపల్ కార్పొరేషన్ ఆధినంలో ఉన్న దుకాణాల అద్దె బకాయిలను ఏమాత్రం ఉపేక్షించబోయేది లేదని సహాయ కమిషనర్‌ కిల్లాన అప్పలరాజు స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన నగరంలోని పలు దుకాణాల వద్దకు వెళ్లి అద్దెలను రాబట్టారు. కొందరు కొంత సమయం కావాలని కోరగా కాల పరిమితిలోగా అద్దెలు చెల్లించాలని లేనియెడల దుకాణాలను మూసివేస్తామని హెచ్చరించారు.

August 21, 2025 / 05:07 AM IST

ఈనెల 25న ద్విచక్ర వాహనానికి వేలం పాట

NZB: మోర్తాడ్ ఎక్సైజ్ స్టేషన్ వద్ద ఈనెల 25వ తేదీన ఓ ద్విచక్ర వాహనానికి వేలం పాట నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సీఐ గుండప్ప తెలిపారు. ఆసక్తి గల వారు ఉదయం 11 గంటలకు వేలం పాటకు హాజరు కావాలని కోరారు. 25% EMD చెల్లించి వేలంపాటలో పాల్గొనాలని సూచించారు.

August 21, 2025 / 05:06 AM IST

MRO కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించిన RDO

VZM: బొబ్బిలి ఆర్డీఓ జీవివి మోహనరావు బుధవారం తెర్లాం ఎమ్మార్వో కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో మండలంలో జరిగిన నష్టం గురించి ఎమ్మార్వో హేమంత్‌ కుమార్‌ను వాకబు చేశారు. వర్షాలకు మండలంలో ఎటువంటి నష్టం జరగలేదని ఎమ్మార్వో వివరించారు. వర్షాలకు బొబ్బిలి డివిజన్‌లో ఎటువంటి నష్టం వాటిల్లలేదని ఈ సందర్భంగా ఆర్డీవో తెలిపారు.

August 21, 2025 / 05:01 AM IST

అనంతపురంలో రేపు మెగా సంగీత కార్యక్రమం

ATP: అనంతపురం పట్టణంలో నటుడు మెగాస్టార్ డా.చిరంజీవి 70వ జన్మదినాన్ని పురస్కరించుకొని సంగీత స్వరాంజలి అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక మెగా సంగీత కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం ఆగస్టు 22వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు అనంత క్లబ్ ఆవరణలో జరగనుండగా, అభిమానులు హాజరై ఈ వేడుకను మరింత ప్రత్యేకం చేయాలని వారు పిలుపునిచ్చారు.

August 21, 2025 / 05:00 AM IST

జేఎన్టీయూ–స్వీడన్ విశ్వవిద్యాలయం సంయుక్త కోర్సులకు ప్రవేశాలు

ATP: అనంతపురం జేఎన్టీయూ, స్వీడన్‌లోని బ్లెకింగ్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ కోర్సులకు తక్షణ ప్రవేశాలు ప్రారంభమైనట్లు రిజిస్ట్రార్ కృష్ణయ్య, సంచాలకులు సుజాత బుధవారం తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు వివరాల కోసం జేఎన్టీయూలోని ఫారిన్ అఫైర్స్ కార్యాలయాన్ని సంప్రదించాలని వారు విజ్ఞప్తి చేశారు.

August 21, 2025 / 04:34 AM IST