VZM: బొబ్బిలి ఆర్డీఓ జీవివి మోహనరావు బుధవారం తెర్లాం ఎమ్మార్వో కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో మండలంలో జరిగిన నష్టం గురించి ఎమ్మార్వో హేమంత్ కుమార్ను వాకబు చేశారు. వర్షాలకు మండలంలో ఎటువంటి నష్టం జరగలేదని ఎమ్మార్వో వివరించారు. వర్షాలకు బొబ్బిలి డివిజన్లో ఎటువంటి నష్టం వాటిల్లలేదని ఈ సందర్భంగా ఆర్డీవో తెలిపారు.