WGL: ఖానాపూర్ మండలం మంగళవారిపేట గ్రామంలో పారిశుద్ధ్య లోపంతో వీధుల్లో చెత్త పేరుకుపోతోంది. గతంలో పంచాయతీలకు వాహనాలు, నిధులు మంజూరై, ఇటీవల మరోసారి నిధులు విడుదలైనా, గ్రామ పంచాయతీ అధికారుల అలసత్వం కారణంగా పారిశుద్ధ్యం కుంటుపడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే ఈ సమస్యపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.