KMM: మధిర మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో BRS, CPM పొత్తు కుదిరిందని ఆ పార్టీ నేతలు తెలిపారు. మొత్తం 12 ఎంపీటీసీ స్థానాల్లో రెండు ఎంపీటీసీ మల్లారం, ఖమ్మంపాడు స్థానాలు సీపీఎంకు కేటాయించారు. అలాగే ఎంపీపీని గెలిపిస్తే కో ఆప్షన్ సభ్యులు సీపీఎంకు ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా ఇప్పటికే మండలంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.