TG: సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి ఊరట లభించింది. గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పుపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. వేముల అనూష్ పిటిషన్ను సుప్రీం తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పు ప్రకారమే నియామకాలు జరగాలని స్పష్టం చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు ఈనెల 15న విచారణ ఉన్న నేపథ్యంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది.