AP: టీడీపీ కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా అండగా ఉంటామని మంత్రి లోకేష్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పాల్వాయిగేట్ ఈవీఎం ధ్వంసం ఘటనలో టీడీపీ నేత నంబూరి శేషగిరిరావు పోరాడి అందరికీ స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. శేషగిరిరావు ఇటీవల గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.