NLR: మనుబోలు మండలం తూర్పు డొంకలోని పొలాల్లో నివాసం ఉంటున్న గిరిజనుడు శనగ శీనయ్య పిడుగుపాటుకు గురై కుడి కన్ను చూపు కోల్పోయాడు. ఈ ఘటనపై గురువారం రెవెన్యూ కార్యాలయంలో సమాచారం అందింది. సమీపంలో పిడుగు పడటంతో దానిని చూసిన శీనయ్య కన్ను దెబ్బతింది. దీనిపై వీఆర్వో నాగార్జున రెడ్డి విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారులకు పంపారు.