TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియకు పూర్తిస్థాయిలో సమయం కేటాయించాలని కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థులను ఖరారు చేయాలన్నారు. గ్రామస్థాయిలో ఏమైనా న్యాయపరమైన అంశాలు వస్తే.. వాటిని నివృత్తి చేయడానికి గాంధీ భవన్లో టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలన్నారు. హైకోర్టు తీర్పు తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.