TG: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే ఇచ్చింది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు జరిగాయి. నిన్న పిటిషనర్ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించగా.. ఇవాళ ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదించారు. అనంతరం హైకోర్టు జీవో 9పై స్టే ఇచ్చింది. తదుపరి విచారణనను నాలుగు వారాలకు వాయిదా వేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది.