HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నిరుద్యోగ నాయకురాలు అస్మాకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తార్నాకలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, త్వరలోనే నిరుద్యోగ విద్యార్థి నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.