ADB: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఈ నెల 10 వరకు అవకాశం ఉందని సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.సంగీత, ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ జగ్రామ్ తెలిపారు. డిగ్రీ, పీజీలో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. అలాగే గిరిజన విద్యార్థులకు ఈ వర్సిటీ ఉచిత విద్యను అందింస్తున్నట్లు పేర్కొన్నారు.