HYD: నిండు ప్రాణానికి – రెండు చుక్కలని పోలియో రహిత సమాజమే మన ముందున్న లక్ష్యమని కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు. గురువారం కలెక్టరేట్లో మాట్లాడుతూ.. ఈ నెల 12 నుంచి 15 వరకు నిర్వహించే పల్స్ పోలియో నిర్వహణ కార్యక్రమంపై జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పల్స్ పోలియో కార్యక్రమం భారతదేశంలో పోలియో రహిత సమాజాన్ని నిర్మించడానికి 1995లో ప్రారంభించామన్నారు.