టీమిండియాతో జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా విజయం సాధించింది. 252 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 48.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి గెలుపొందింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో లారా(70), డిక్లెర్క్(84) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో క్రాంతి, రాణా చెరో 2, అమన్, చరణి, దీప్తి తలో వికెట్ తీసుకున్నారు.