NLG: కేతేపల్లి మండలం గుడివాడకి చెందిన భవిష్య కాలేజీ ఛైర్మన్ రాచకొండ జానయ్య బీజేపీలో చేరారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలో BJP అనుసరిస్తున్న విధానాలకు ఆకర్షీతులై పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు.