W.G: పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారం కోసం భీమవరంలో ఉన్న అన్ని కోర్టుల్లో డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి లక్ష్మీ నారాయణ అన్నారు. గురువారం భీమవరంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కేసులు పరిష్కరించుకోవాలన్నారు.