సత్యసాయి: సోమందేపల్లి మండలంలో సీనియర్ పాత్రికేయుడు రంగయ్య గురువారం రాత్రి మరణించారు. రంగయ్య 40 ఏళ్లుగా విలేకరిగా పనిచేశారు. ఈ సందర్భంగా రంగయ్య మరణం విన్న పలువురు పాత్రికేయులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విలేకరిగా ఆయన చేసిన సేవలను మండల విలేకరులు కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్థించారు.