బీహార్ యువకుడు చంద్రశేఖర్ మండల్ వినూత్న ఆలోచన చేశాడు. కూలీలకు ఆన్ లైన్ యాప్ రూపొందించాడు. లేబర్ చౌక్లను ఎందుకు డిజిటల్ చేయకూడదని ఆలోచించి.. ‘డిజిటల్ లేబర్ చౌక్’ ప్లాట్ ఫాం సృష్టించాడు. ఇందులో మేస్త్రీలు, పెయింటర్లు, కార్పెంటర్లు ఉంటారు. ఎవరికైనా లేబర్ కావాలంటే.. ఇందులో నమోదు చేసుకోవాలి. కార్మికులు ఆ వివరాలు చూసి నేరుగా కాల్ చేసి ఆసక్తి తెలుపుతారు.