MBNR: తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాలకు సోషల్ మీడియా విభాగంలో కన్వీనర్లను నియమిస్తూ పార్టీ ప్రధాన నాయకత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్‌గా నవీన్ కుమార్ నియమితులయ్యారు. ప్రజా సమస్యలను చేరవేయడం వీరి బాధ్యత.