NLG: చండూరు మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న రెండు వరుసల (డబుల్ రోడ్డు) పనులను మున్సిపల్ కమిషనర్ మల్లేష్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డుకు ఇరువైపులా ఉన్న వాణిజ్య సముదాయ భవన యజమానులు సహకరించి పనులు తొందరగా పూర్తి అయ్యేందుకు దోహదపడాలని కోరారు. కార్యక్రమంలో ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ అరవింద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.