AP: పలు నియామక పరీక్షల ఫలితాలను APPSC విడుదల చేసింది. ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్, లైబ్రేరియన్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలను అధికారులు విడుదల చేశారు. వాటితో పాటు అసిస్టెంట్ కెమిస్ట్ ఉద్యోగాల భర్తీ పరీక్ష ఫలితాలనూ ప్రకటించారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను APPSC.gov.inలో అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.