ASR: కొయ్యూరు మండలం రేవళ్ల కంఠారం గ్రామానికి చెందిన మాడుగుల సూరిబాబు అనే వ్యక్తి గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని మంప ఎస్సై కే.శంకరరావు గురువారం తెలిపారు. ఆరోగ్య సమస్యల నేపథ్యంలో మనస్తాపంతో, గడ్డి మందు తాగాడన్నారు. కుటుంబ సభ్యులు అతడిని నర్సీపట్నం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.