SRCL: క్రెడిట్ కార్డు యాక్టివేషన్ పేరుతో వాట్సప్‌లో ఏపీకే లింక్ షేర్ చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ నిందితుడిని అరెస్టు చేసినట్టు సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. సైబర్ నేరాలకు పాల్పడుతున్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన అంకిత్ కుమార్ (32)ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.