గత కొన్ని రోజులుగా వెండి ధర భారీగా పెరుగుతుంది. ఈరోజైతే ఏకంగా రూ.7 వేలు పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.1,77,000కు చేరింది. కేవలం రెండు రోజుల్లోనే రూ.9,900 పెరగడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. భవిష్యత్లో వెండి మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో వెండి ధరలపై సామాన్యులలో ఆందోళన మొదలైంది.