NLR: అనంతసాగరం మండలం అరుంధతి వాడలో గురువారం ఎంపీడీవో ఐజాక్ ప్రవీణ్ అక్షరాభ్యాస కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన నిరక్షరాస్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి చదువుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను వారికి వివరించారు. నిరుద్యోగులు ఈ కేంద్రాలకు వచ్చి అక్షర జ్ఞానం పొందాలని ఆకాంక్షించారు.