ADB: నీతి ఆయోగ్ యూజ్ కేస్ చాలెంజ్‌లో ఆదిలాబాద్‌కు బహుళ జాతీయ పురస్కారాలు అందుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా గురువారం తెలిపారు. జిల్లా మరోసారి తెలంగాణకు గౌరవాన్ని తీసుకువచ్చిందని గుర్తు చేశారు. విద్య, సామాజిక అభివృద్ధి, ఆరోగ్యం, పోషణ వంటి విభాగాల్లో పురస్కారాలతో పాటు రూ. 3లక్షల బహుమతి లభించినట్లు పేర్కొన్నారు.