PDPL: ఎన్టీపీసీ పరిధి పీకే రామయ్య కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవన పెండింగ్ పనులను పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. పాఠశాలను గురువారం కలెక్టర్ సందర్శించారు. అనంతరం పేద విద్యార్థుల కోసం సాయి సేవా సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న సాయి విద్యాలయంలో సందర్శించారు. పాఠశాల అభివృద్ధికి ఎన్టీపీసీతోపాటు కృషి చేస్తామన్నారు.