ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన మంతెన రామయ్యపై నమోదైన పోక్సో కేసులో నేరం రుజువైనట్లు జిల్లా ఎస్పీ శబరీశ్ తెలిపారు. గురువారం కోర్టు అతనికి జీవిత ఖైదు, 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.12 వేల జరిమానా విధించింది. బాధితురాలికి రూ. 10 లక్షల నష్టపరిహారం అందించాలని కోర్టు తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ పేర్కొన్నారు.