సత్యసాయి: ధర్మవరం పట్టణం 7వ వార్డు కేశవనగర్లో 15వ ఫైనాన్స్ నిధులు రూ.10 లక్షల వ్యయంతో డ్రైనేజ్ పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆదేశాలతో బీజేపీ నేత హరీష్ బాబు పనులను పర్యవేక్షించారు. ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా పనులు వేగంగా పూర్తిచేయాలని ఆయన కాంట్రాక్టరును ఆదేశించారు.