WGL: వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ స్థాపన కోసం సీజీహెచ్ఎస్ అడిషనల్ డైరెక్టర్ రోహిణితో కలిసి హనుమకొండలో పలు ప్రభుత్వ భవనాలను గురువారం పరిశీలించారు. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలందించాలనే లక్ష్యంతో ఈ చర్య చేపట్టామన్నారు. త్వరితగతిన భవనం ఎంపిక పూర్తి చేసి సెంటర్ ప్రారంభించాలని ఎంపీ సూచించారు.