కృష్ణా: గుడివాడలో PDS బియ్యం అక్రమ రవాణాపై పోలీసులు దాడులు నిర్వహించారు. వన్‌టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ ఎస్సై గౌతమ్ కుమార్ తమ సిబ్బందితో కలిసి కార్మిక నగర్ ప్రాంతంలో విశ్వసనీయ సమాచారం ఆధారంగా దాడులు గురువారం నిర్వహించారు. ఈ దాడిలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని, అతని వద్ద నుంచి 22 బస్తాలలో ఉన్న1087 కిలోల PDS బియ్యం ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.