HYD: డ్రగ్స్ దందా కట్టడిలో భాగంగా హైదరాబాద్ పోలీసులు ఓ నైజీరియన్ ను గుర్తించారు. వీసా గడువు ముగిసినా అక్రమంగా ఉంటూ గంజాయి విక్రయిస్తున్న ఓనోరా సోలమన్ చిబుజే (46) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. FRRO సహకారంతో నైజీరియాకు డిపార్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ ఫ్రీ HYD కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, అందుకు ప్రజలు సహకరించాలని పోలీసులు కోరారు.