GNTR: పోలీస్ సిబ్బంది అంతా సమన్వయంతో పనిచేసి, ప్రజలకు ఉత్తమమైన పోలీస్ సేవలు అందించాలని ఎస్పీ వకుల్ జిందల్ సూచించారు. ఈ మేరకు గురువారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రతిరోజు రెండు పూటలా రోల్ కాల్ నిర్వహించాలని ఆయన ఆదేశించారు. అలాగే, వారానికి కనీసం ఒకసారి సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించాలని ఎస్పీ తెలిపారు.