KNR: ప్రభుత్వ శాఖలలో పారదర్శకమైన పాలన అందించేందుకే సమాచార హక్కు చట్టం రూపొందించారని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ అన్నారు. గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సమాచార హక్కు చట్టం- 2005 అమల్లోకి వచ్చి 20 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఈ నెల 5 నుంచి 12వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో అవగాహన కల్పించారు.