బీసీసీఐ మహిళల ప్రీమియర్ లీగ్-2026 మెగా వేలాన్ని ఈ ఏడాది నవంబర్ 25 లేదా 29న నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ వేలంలో పాల్గొనేందుకు ఒక్కో ఫ్రాంచైజీ గరిష్టంగా రూ.15 కోట్లు ఖర్చు చేయవచ్చు. ఈ నేపథ్యంలో, ప్రతి ఫ్రాంచైజీ గరిష్టంగా ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చని బీసీసీఐ వెల్లడించింది. రిటెన్షన్ జాబితాను సమర్పించడానికి నవంబర్ 5 వరకు గడువు విధించింది.