GDWL: ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను రక్షించేందుకు గురువారం తుంగభద్ర నదిలో ఎన్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్ బృందాలచే మాక్ డ్రిల్ నిర్వహించారు. పోలీస్ శాఖ ఆదేశాల మేరకు అలంపూర్ సీఐ రవిబాబు ఆధ్వర్యంలో సుమారు రెండు గంటల పాటు ఈ శిక్షణ జరిగింది. స్పెషల్ బోట్ల సహాయంతో వరద నీటిలో ప్రాణాలను ఎలా కాపాడాలో రెస్క్యూ టీమ్లు కళ్లకు కట్టినట్టు చూపించారు.