PDPL: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో గురువారం గాంధీ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. గాంధీ అహింస, సత్య సిద్ధాంతాలు ప్రపంచానికి మార్గదర్శకాలు అన్నారు. భారతదేశ ప్రతినిధిగా హాజరవడం గర్వకారణమన్నారు. భారతీయులు, ప్రవాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.