KNR: సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ ఆధ్వర్యంలో HYD రవీంద్ర భారతిలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బెస్ట్ ఫెర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్ కేటగిరిలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్వర్మచే అవార్డు అందుకున్నారు.