GDWL: రోడ్డు ప్రమాదంలో గాయపడి కర్నూల్ పట్టణంలోని రేణుకా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఉపాధ్యాయుడు వేణుగోపాల్‌ని గురువారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పరామర్శించారు. ఉండవెల్లి మండల కేంద్రానికి చెందిన టీచర్ వేణుగోపాల్ మానవపాడు ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. అలంపూర్ చౌరస్తాలో మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.