CTR: పులిచెర్ల మండలంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం స్వామివారికి అభిషేక వేడుకలు జరిగాయి. ఈ మేరకు ఆలయంలో ఉదయం అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. కాగా, ఉభయ దారులుగా దేవలంపేటకు చెందిన మురళీ కుటుంబ సభ్యులు వ్యవహరించారు.