మహిళల వన్డే ప్రపంచ కప్‌లో సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్లు తీవ్రంగా తడబడుతున్నారు. 26 ఓవర్లలో 102 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఓపెనర్లు ప్రతీక(37), స్మృతి(23) స్వల్ప పరుగులు చేయగా, మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. హర్మన్‌ప్రీత్(9), హర్లీన్(13), రోడ్రిగ్స్(0), దీప్తి(4) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు.