MBNR: ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం జడ్చర్ల పట్టణంలో ఏర్పాటు చేసిన భవిత కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి గురువారం తనిఖీ చేశారు. భవిత కేంద్రంలో పిల్లలకు అందిస్తున్న ఫిజియోథెరపీ స్పీచ్ థెరపీ విధానాన్ని పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న టాయిలెట్‌ను పరిశీలించారు. టాయిలెట్లోకి వెళ్లేందుకు భవనం నుంచి దారి ఏర్పాటు చేయాలన్నారు.