PPM: విశాఖపట్నం హిందూస్థాన్ షిప్ యార్డ్ కంపెనీలో ఉద్యోగాల కొరకు 3 నెలల నైపుణ్య శిక్షణను ఇస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయికృష్ణ చైతన్య తెలిపారు. ఈమేరకు గురువారం ఓ ప్రకటన చేశారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విశాఖపట్నం స్కిల్ డెవలప్మెంట్ ఇనిస్టీట్యూట్లో ఐ.టీ.ఐ అభ్యర్ధులకు 3 నెలలు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగం అవకాశం కల్పిస్తామన్నారు.