AKP: రాంబిల్లి మండలం కొత్తూరు గ్రామంలో గుమ్మళ్లమ్మ తల్లి జాతర మహోత్సవాలు శుక్రవారం వైభవంగా ముగిసాయి. కలెక్టర్ విజయ కృష్ణన్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ జ్ఞాపికను కలెక్టర్కు అందజేశారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు చేశారు.