W.G: న్యూఢిల్లీలోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని కేంద్రమంత్రి, నరసాపురం ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గురువారం దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్.వి. టెంపుల్, న్యూఢిల్లీ కమిటీ అధ్యక్షులుగా నియమితులైన యెదుగుండ్ల సుమంత్ రెడ్డిని అభినందించడం జరిగింది.