SRPT: ప్రపంచంలోని ఉద్యమకారులకు విప్లవకారులకు, విద్యార్థి యువతకు చేగువేరా పోరాట స్ఫూర్తి ఆదర్శం అని మునగాల జనవేదిక కన్వీనర్ సీతారాం అన్నారు. గురువారం మునగాల మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన చేగువేరా వర్ధంతి కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.